'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కథా నాయిక నిధి అగర్వాల్. ఆమె ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయాన్ని రుచి చూసింది. ఇప్పుడా విజయోత్సాహంలోనే ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ఆమె త్వరలో పవన్ కల్యాణ్‌కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలు నిజమేనని ధ్రువీకరించింది నిధి.
ఇది నాకో బంగారు అవకాశం: నిధి - పవన్ సరసన నిధి
యువ కథానాయిక నిధి అగర్వాల్ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. తాజాగా ఈ విషయంపై స్పందించింది నిధి.

నిధి
ఈ విషయమై నిధి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ "అవును, నేను పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో భాగమవడం నాకు కలలా అనిపిస్తోంది. ఇది నా తొమ్మిదో చిత్రం. నా కెరీర్‌కు ఓ బంగారు సినిమా అవుతుంది. పవన్ సర్‌తో పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా" అని చెప్పింది. నిధి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాతో పాటు తమిళంలో 'ఈశ్వరన్' అనే చిత్రం చేస్తోంది.
Last Updated : Feb 6, 2021, 7:43 AM IST