'మోడ్రన్ గర్ల్.. గ్లామర్ హీరోయిన్'.. అన్న మాటలు వినీ వినీ అలిసిపోయానని అంటోంది నటి నిధి అగర్వాల్(nidhi agarwal upcomin movies). తెరపై గ్లామర్ డాల్‌గా కనిపించడం కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే తనకిష్టమని చెబుతోంది. ప్రస్తుతం ఈ అందాల నిధి.. పవన్ కల్యాణ్‌కు(pawan kalyan new movie) జోడీగా 'హరి హర వీరమల్లు'లో(harihara veeramallu release date) నటిస్తుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రమిది. ఈ చిత్ర విశేషాలను నిధి అగర్వాల్(nidhi agarwal twitter) ఇటీవల చెప్పింది.
ఆ పాత్రల్లో నటించడమే నాకిష్టం: నిధి అగర్వాల్ - pawan latest news
గ్లామర్, మోడ్రన్ పాత్రలే కాకుండా డిఫరెంట్‌గా ఉండే రోల్స్‌లో కనిపించడం తనకు ఇష్టమని హీరోయిన్ నిధి అగర్వాల్(nidhi agarwal movie list) చెబుతోంది. 'హరిహర వీరమల్లు' సినిమాలో తనకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని తెలిపింది.
"వీరమల్లు..'లో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర ఇది. శారీరకంగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం చాలా ఆభరణాలు ధరించాను. ఒంటిపై ధరించిన కాస్ట్యూమ్స్ చాలా బరువైనవి. ప్రతిదీ చేతితో కుట్టినదే. అందుకే వీటిని క్యారీ చేస్తూ.. షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేది. ఓ షాట్ అయిపోతే జాగ్రత్తగా ఓ దగ్గర కూర్చోవడమే తప్ప.. విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. అయితే ఈ కష్టమంతా నాకెంతో విలువైనదిగా అనిపించేది. నటిగా ఇంత అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకుఆనందంగా ఉంది" అని నిధి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'హీరో' అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.
ఇవీ చదవండి: