Nidhhi simbu news: 'సవ్యసాచి' చిత్రంతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు అందాల తార నిధి అగర్వాల్. ప్రస్తుతం 'హీరో' విడుదల కోసం ఎదురుచూస్తున్న ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఆమె ఏడడుగులు వేయనున్నారని సమాచారం.
'ఇస్మార్ట్ శంకర్'తో విజయం అందుకున్న తర్వాత నిధి అగర్వాల్‌కు కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. శింబు 'ఈశ్వరన్' సినిమాలో నిధి హీరోయిన్‌గా చేసింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ జంటకు ఫాలోయింగ్ పెరిగింది.