సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో మహేశ్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో మహేశ్ సరసన యువ కథానాయిక నిధి అగర్వాల్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ నడుస్తోంది.
మరోవైపు ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'పార్థు' అనగానే గుర్తొచ్చేది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అతడు' చిత్రంలో మహేశ్ పాత్ర పేరు. ఇప్పుడిదే పేరును కొత్త చిత్ర టైటిల్‌గా పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.