వరుస చిత్రాలతో బిజీగా ఉన్న 'ఇస్మార్ట్ శంకర్' భామ నిధి అగర్వాల్ సామాజిక మాధ్యమాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. తరచూ తనకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ కుక్కకు సంబంధించిన పోస్ట్‌ను నెట్టింట షేర్ చేసింది. ఆ కుక్క పేరు కోకో అని అది కనిపించకుండా పోయిందని తెలిపింది. అలాగే ఆ పెట్‌ను పట్టిస్తే లక్ష రూపాయల రివార్డు కూడా లభిస్తుందని అందులో పేర్కొంది. దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్‌ను కూడా పొందుపరిచింది.
పట్టిస్తే లక్ష రూపాయలు నజరానా: నిధి అగర్వాల్ - నిధి అగర్వాల్ పెట్ మిస్సింగ్
తరచూ అభిమానులతో సామాజిక మాధ్యమాల వేదికగా టచ్‌లో ఉంటోంది నటి నిధి అగర్వాల్. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ కుక్క తప్పిపోయిన విషయాన్ని పోస్ట్ చేసింది. పట్టించిన వారికి రివార్డు లభిస్తుందని పేర్కొంది.

నిధి అగర్వాల్
ప్రస్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తోంది నిధి. అలాగే గల్లా అశోక్ హీరోగా రూపొందుతోన్న సినిమాలోనూ లీడ్ రోల్ పోషిస్తోంది.
Last Updated : May 13, 2021, 11:39 AM IST