ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ లక్ మారనుందా? అంటే అవుననే అందరూ మాట్లాడుకుంటున్నారు. 'సవ్యసాచి', 'మిస్టర్.మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి క్లాస్, మాస్ చిత్రాల్లో నటించిప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఇటీవల విడుదలైన 'భూమి', 'ఈశ్వరన్' మినహా అక్కడా ప్రాజెక్ట్‌లు దొరకలేదు.
ఈ ఛాన్సుతో నిధి దశ మారనుందా? - పవన్-క్రిష్ సినిమాలో నిధి అగర్వాల్
పవన్-క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీలో నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రంతోనైనా టాలీవుడ్లో నిధికి స్టార్ హోదా దక్కుతుందేమో చూడాలి.
కాగా, ప్రస్తుత సమాచారం ప్రకారం.. నిధి అగర్వాల్‌కు టాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామాలో కథానాయికగా నటించే అవకాశాన్ని ఈ నటి దక్కించుకున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇదే వార్తలు మరోసారి నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఆమె షూట్‌లో పాల్గొందని.. సంక్రాంతి తర్వాత కొన్నిరోజులకే ఆ షెడ్యూల్ పూర్తి అయ్యిందని నెట్టింట్లో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. దీంతో సదరు వార్తలపై నెటిజన్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చూడండి:సెట్లో అడుగుపెట్టిన రానా.. పవన్‌తో ఫైట్!