తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిధి అగర్వాల్​కు గుడి కట్టిన అభిమానులు - నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్

అభిమానుల నుంచి నిధి అగర్వాల్​కు ఊహించని బహుమతి లభించింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? దానిపై ఆమె స్పందన ఏంటి?

Nidhhi Agerwal gets a temple, says she's shocked
వాలంటైన్స్ డే.. నిధి అగర్వాల్​కు ఊహించని గిఫ్ట్

By

Published : Feb 15, 2021, 7:15 AM IST

హీరోయిన్ నిధి అగర్వాల్​.. తనకొచ్చిన వాలంటైన్స్ డే బహుమతిని చూసి షాకైంది. తనకు గుడి కట్టి, అందులో విగ్రహానికి అభిమానులు పాలభిషేకం చేశారని ఆమెనే స్వయంగా చెప్పింది. అసలు ఇది ఊహించనేలేదని, వారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.

హీరోయిన్ నిధి అగర్వాల్ విగ్రహం

ప్రేమికుల దినోత్సవం కానుకగా తమిళనాడులో ఓ చోట నిధి అగర్వాల్ విగ్రహానికి, కొందరు తెలుగు, తమిళ అభిమానులు పాలతో అభిషేకం చేశారు. ఆ ఫొటోల్ని కొందరు నిధికి సోషల్ మీడియాలో పంపించారు. దీంతో ఆమె షాకైంది. గతంలో తమిళంలో ఎమ్​జీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి పలువురు నటీనటులకు గుడి కట్టారు.

నిధి అగర్వాల్ తమిళంలో నటించిన తొలి రెండు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతికే విడుదలయ్యాయి. 'భూమి' ఓటీటీలో, 'ఈశ్వరన్' థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పలు చిత్రాలు చేసిన ఈ భామ.. ప్రస్తుతం పవన్​-క్రిష్ కాంబోలో తీస్తున్న ప్రాజెక్టులో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details