నటిగా తనను తెరపై చూసినప్పుడు పేరెంట్స్ గర్వపడ్డారని అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. చిన్నతనంలో చాలా అల్లరి పనులు చేశానని చెబుతోంది. స్కూల్ ప్రోగ్రస్ కార్డులో తల్లి సంతకాన్ని కాపీ కొట్టినట్లు తాజాగా వెల్లడించిందీ నటి.
'నా ప్రోగ్రస్ కార్డులో దొంగ సంతకం చేశా!' - నిధి అగర్వాల్ న్యూస్
తన జీవితంలో చేసిన అల్లరి పనులు, తల్లిదండ్రులు గర్వపడిన సందర్భాలను గుర్తు చేసుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. నటిగా తన తల్లి నుంచి పొందిన ప్రశంసలను తాజాగా వెల్లడించింది.
చిన్నతనంలో అమ్మ విషయంలో మీరు చేసిన అల్లరి పనేంటి? ఆమె మిమ్మల్ని చూసి గర్వపడిన సందర్భమేది?
నిధి అగర్వాల్:చిన్నతనంలో చాలా అల్లరి పనులు చేశా. ప్రత్యేకంగా అమ్మ విషయంలో చేసిందంటే.. ఆమె సంతకాన్ని కాపీ కొట్టడం. చిన్నప్పుడు ఎప్పుడైనా మార్కులు తక్కువగా వస్తే.. ప్రోగ్రస్ కార్డ్‌తో నాన్న ముందుకెళ్లడానికి చాలా భయమేసేది. పోనీ అమ్మకు చూపించినా తిట్లు తప్పవు. అందుకే ఆమె సంతకాన్ని నేనే పెట్టేసుకునేదాన్ని. నాన్న సంతకం చాలా కష్టం కానీ.. అమ్మది చాలా తేలిక. కొన్నాళ్లకు అమ్మకు నా పని తెలిసి గట్టిగా మందలించింది. ఇక అమ్మ నన్ను చూసి గర్వపడిన సందర్భమంటే.. నన్ను నటిగా తెరపై చూసుకున్న రోజే. ప్రతి పనిలో తను నాకెంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంటుంది. 'నువ్వు ఎప్పడూ దేని గురించి దిగులు చెందకు. నిన్ను నువ్వు ఎప్పుడో నిరూపించుకున్నావు. కొత్తగా నువ్వు మళ్లీ నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు' అంటూ నాలో కొత్త ఉత్సాహం నింపుతుంటుంది. ఈ మాటలే అమ్మ నుంచి నేను పొందిన గొప్ప ప్రశంసలు.