తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లేటు వయసులో ఘాటు ప్రేమ.. పెళ్లి - ఎరికా కొయికీ

హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ నాలుగోసారి పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన గర్ల్​ఫ్రెండ్​ ఎరికా కోయికీని త్వరలో వివాహమాడనున్నాడీ 55 ఏళ్ల నటుడు.

నికోలస్ కేజ్

By

Published : Mar 27, 2019, 5:00 AM IST

ప్రముఖ హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. 55ఏళ్ల వయసులో తన గర్ల్​ఫ్రెండైన ఎరికా కొయికీని వివాహమాడనున్నాడు. పెళ్లికి సంబంధించిన ధ్రువపత్రాలు అంతర్జాలం ద్వారా బహిర్గతమయ్యాయి. వివాహ అనుమతి కోసం అమెరికాలోని నెవాడా కోర్టుకు దరఖాస్తు చేశాడీ ఘోస్ట్​రైడర్​ నటుడు.

కేజ్, ఎరికా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ప్రైమల్ సినియా చిత్రీకరణ సమయంలో ప్యూర్టోరీకోలో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. నికోలస్ కేజ్ గతంలో మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు.

1990ల్లో ప్యాట్రిషియాను వివాహం చేసుకున్నాడు కేజ్. అనంతరం ఆమెతో విడిపోయి 2002లో మేరీ ప్రైస్లీని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలానికే మేరీతో తెగదెంపులు చేసుకుని 2004లో అలైస్ కిమ్​ని కల్యాణమాడాడు. 2016లో ఈమెతోనూ విడిపోయి ఎరికాతో తన జీవితాన్ని పంచుకోబోతున్నాడు నికోలస్.

లీవింగ్ ఇన్ లాస్ వేగాస్, నేషనల్ ట్రెజర్, లార్డ్ ఆఫ్ వార్, కాన్ ఎయిర్, ది హీట్, ఘోస్ట్ రైడర్, ది రాక్, సిటీ ఆఫ్ యాంగిల్స్ లాంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడునికోలస్ కేజ్. సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకునే నికోలస్ కేజ్ నిజ జీవితంలోనూ అమ్మాయిలనూ అదే విధంగా ఆకర్షిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details