ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ.. ముంబయిలో శుక్రవారం ఓ హోలీ వేడుకను ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
అంబానీ ఇంట్లో హోలీ వేడుకలు.. బాలీవుడ్ తారల హంగామా - cinema news
ముంబయిలో శుక్రవారం రాత్రి జరిగిన హోలీ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇషా అంబానీ ఇంట హోలీ వేడుకలు
ఈ ఈవెంట్లో ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్.. కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆ ఫొటోలు ఇన్స్టాలో పోస్ట్ చేశాడు నిక్. తన తొలి హోలీ పండుగను ఎంతో ఆనందంగా చేసుకున్నానని రాసుకొచ్చాడు.
వీరే కాకుండా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సొనాలి బింద్రే, హ్యుమా ఖురేషి, అనూష దండేకర్ అదరిపోయే దుస్తుల్లో కనువిందు చేశారు.