తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్​.జి.కె. ట్రైలర్​ : రాజకీయ నేతగా సూర్య - ఎన్.జి.కె

సూర్య హీరోగా రానున్న ఎన్.జి.కె ట్రైలర్ విడుదలైంది. యువ రాజకీయ నాయకుడి పాత్రలో ఆకట్టుకుంటున్నాడీ కథానాయకుడు.

యువ రాజకీయ నాయకుడిగా సూర్య

By

Published : Apr 29, 2019, 9:49 PM IST

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎన్​.జి.కె'. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. యువ రాజకీయ నేతగా కనిపించేందుకు సిద్ధమయ్యాడీ హీరో. ఈ సినిమాలో సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు.

'ఓ చిన్న గుంపుతో వస్తే నిన్ను రాజకీయాల్లోకి రానిస్తారని అనుకుంటున్నావా','ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి ఉంటుంది..వాడికి దేశం అంటే పిచ్చి', 'నిజం చెప్పాలంటే మన స్వాతంత్ర్యాన్ని బ్రిటీష్ వాళ్ల దగ్గర నుంచి తీసుకుని రాజకీయ నాయకులకిచ్చేశాం'.. అనే డైలాగ్​లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

సెల్వరాఘవన్ ఈ చిత్ర దర్శకుడు.యువన్ శంకర్​ రాజా సంగీతమందించాడు. డ్రీమ్ వారియర్స్​ పతాకంపై ఎస్​.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. వేసవి కానుకగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ABOUT THE AUTHOR

...view details