యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్లో రానున్న చిత్రం 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మరో ట్వీట్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు ఓం రౌత్.
"గురువారం ఉదయం 7.11 గంటలకు సినిమాకు సంబంధించి అప్డేట్తో మీముందుకు వస్తున్నాం" అంటూ ఓం రౌత్ వెల్లడించారు. ఈ క్రమంలోనే 7వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడున్నాడని రాసుకొచ్చారు. దీంతో ఈ చిత్రంలో విలన్ అయిన రావణుడి పాత్రలో నటించబోయే వ్యక్తి వివరాలు చెప్తారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ రోల్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.