Gani Movie Release: మెగాహీరో వరుణ్‌తేజ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం 'గని' ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం తెలిపింది. మెగాహీరో వరుణ్‌తేజ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు..!
Adavallu miku joharlu movie: శర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్న మూవీ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే.. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా వెటరన్ హీరోయిన్ రాధిక.. కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
ఆడవాళ్లు మీకు జోహార్లులో రాధిక ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా గుర్తుందా శీతాకాలం..
సత్యదేవ్- తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ దుమ్ములేపింది. పది లక్షల వ్యూస్‌ను సంపాదించుకుంది. కన్నడ హిట్ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్ తీసిన ఈ సినిమాలో హీరో, అతడి మూడు ప్రేమకథల చుట్టూ తిరుగుతుంది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి ఇతరపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతమందించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించారు.
సర్కారు వారి పాట..
Sarkari Vaari Paata Movie: 'సర్కారు వారి పాట' మూవీలో కళావతి సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. తాజాగా 19 లక్షల వ్యూస్‌ను సంపాదించుకుంది. 9 లక్షల లైక్‌లను సొంతం చేసుకుంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతమందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇదీ చదవండి:బాలయ్యతో సినిమాకు ఆ డైరెక్టర్ ప్రయత్నం!