తెలంగాణ

telangana

ETV Bharat / sitara

This Week Movie Releases: ఈ వారం విడుదలయ్యే చిత్రాలివే! - ఆకాశవాణి సినిమా విడుదల తేదీ?

ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సిరీస్​లు.. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ అవేంటి? ఎప్పుడొస్తున్నాయి? చూద్దాం..

new release movies
కొత్త సినిమా కబుర్లు

By

Published : Sep 20, 2021, 5:38 AM IST

Updated : Sep 20, 2021, 9:07 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'లవ్​స్టోరి'(Love Story Movie Release Date) ఈ వారమే థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్​ కానున్నాయి. ఓటీటీలోనూ పలు సినిమాలు/వెబ్ సిరీస్​లు రానున్నాయి. ఎందులో అవి విడుదల కానున్నాయి? వాటి రిలీజ్​ డేట్​ల వివరాలు మీకోసం.

థియేటర్​లో ఒక్కటే..

లవ్​స్టోరీ..నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్​స్టోరి'. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి సెప్టెంబరు 24న రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్(Love Story Trailer), పాటలు(Saranga Dariya Song) యూత్​ మనసు దోచాయి. సినిమా కోసం అయితే చాలామంది వెయిట్​ చేస్తున్నారు.

ఓటీటీలో బోలెడు..

ఇష్క్..తేజా, ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash Varrier) నటించిన 'ఇష్క్' ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 20 నుంచి సన్​నెక్స్ట్​లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాను రొమాంటిక్ థ్రిల్లర్​గా తీశారు.

ఆకాశవాణి..సముద్రఖని(Samuthirakani New Movie) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆకాశవాణి'(Samuthirakani Aakashavaani). అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించారు. రెట్రో కథతో తీసిన ఈ సినిమాను నేరుగా సెప్టెంబరు 24న సోనీ లివ్​లో(Sonyliv) రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు.

అలనాటి సిత్రాలు..శ్వేత, ప్రవీణ్, యశ్ తదితరులు నటించిన 'అలనాటి సిత్రాలు' సినిమా.. జీ5లో సెప్టెంబరు 24న విడుదల కానుంది.

పరిణయం..దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం.. 'పరిణయం' పేరుతో ఆహా ఓటీటీలో సెప్టెంబరు 24నే రిలీజ్ అవుతుంది.

ఇతర భాషల సినిమాలు/వెబ్ సిరీస్​లు..

పైన చెప్పిన సినిమాలతో పాటు సన్నీ(మలయాళం), రారా(తమిళం) చిత్రాలు అమెజాన్ ప్రైమ్​లో వరుసగా సెప్టెంబరు 23, 24 తేదీల్లో విడుదల కానున్నాయి. క్రైమ్ స్టోరీస్ వెబ్ సిరీస్​ తొలి సీజన్.. నెట్​ఫ్లిక్స్​లో సెప్టెంబరు 22న రిలీజ్​ కానుండగా, కోటా ఫ్యాక్టరీ సీజన్-2 నెట్​ఫ్లిక్స్​లో 24వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 20, 2021, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details