'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా 'బంగార్రాజు' అనే సినిమాను తెరకెక్కిద్దామనుకున్నాడు అక్కినేని నాగార్జున. పలు కారణాల వల్ల అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్న కారణంగా మరో చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నాగ్. ఈ నేపథ్యంలోనే సాల్మన్ అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాజెక్టు దాదాపు ఖరారైందని తెలుస్తోంది.
నూతన కథానాయికతో నాగ్ రొమాన్స్..! - nagarjuna new movie
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున నటించబోయే చిత్రంతో ఓ కొత్త కథానాయిక వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ సినిమాలో అంటే..?
నాగార్జున
ఈ చిత్రంలో నాగార్జున సరసన నటించేందుకు నూతన కథానాయికను ఎంపిక చేస్తున్నారని సమాచారం. కథానాయిక పాత్ర విభిన్నంగా ఉంటుందని, ఇందుకు ప్రేక్షకులకు పరిచయం లేని నటి అయితేనే బాగుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం.
ఇవీ చూడండి.. సైకోగా మారబోతున్న నేచురల్ స్టార్..?