తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అతడితో క్వారంటైన్​ అస్సలు బోర్​ కొట్టలేదు' - అర్జున్ కపూర్​

హీరో అర్జున్​ కపూర్​తో తన బంధం​ గురించి పరోక్షంగా చెప్పేసింది హీరోయిన్​ మలైకా అరోరా. ఇంతకీ ఆమె ఏం చెప్పింది?

Never a dull moment with him: Malaika on being quarantine with Arjun
అతడితో క్వారంటైన్​ అస్సలు బోర్​ కొట్టలేదు:మలైకా

By

Published : Dec 27, 2020, 5:49 AM IST

Updated : Dec 27, 2020, 6:18 AM IST

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్​, హీరోయిన్​ మలైకా అరోరా జోడీ గురించి ఇప్పటికే చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, సహజీవనం కూడా చేస్తున్నారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయానికి బలం చేకూరుస్తూ ఓ ఇంటర్వ్యూలో క్రేజీ విషయాన్ని మలైకా వెల్లడించింది. ఓ నటుడితో క్వారంటైన్​లో ఉన్నానని, అతడు తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉన్నాడని చెప్పింది. అభిమానులు మాత్రం ఆ నటుడు అర్జున్ అని చెబుతున్నారు.

"నేను ఓ నటుడితో క్వారంటైన్​లో ఉన్నాను. చాలా సరదా వ్యక్తి. అతడితో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. నన్ను ఎప్పుడూ నవ్వించాలని ప్రయత్నిస్తాడు"

-- మలైకా అరోరా, బాలీవుడ్​ హీరోయిన్​

అయితే తమ బంధంపై ఈ జోడీ ఎలాంటి విషయం ఇప్పటివరకు చెప్పలేదు. మాటల్లో చెప్పకపోయినా.. సోషల్ మీడియా ఖాతాల్లో వీరి పోస్టులు చూసిన వారు.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలారోజులుగా మాట్లాడుకుంటున్నారు.

ఇదీ చూడండి:'క్రేజీ అంకుల్స్​'తో నవ్వులు పండిస్తున్న శ్రీముఖి!

Last Updated : Dec 27, 2020, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details