తొలినాళ్లలో ఎక్కువగా గ్లామర్ రోల్స్‌తో పేరు తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత నుంచి తన నటనా ప్రాధాన్య చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. కొంతకాలంగా నాయికా ప్రాధాన్య సినిమాలతో ఆమె కెరీర్ ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. సోలో హీరోయిన్గా వరుస విజయాలను దక్కించుకుంటూ దక్షిణాదిలో టాప్ కథానాయికగా దూసుకెళ్తోంది.
ప్రస్తుతం చిరంజీవితో 'సైరా', విజయ్‌తో 'బిగిల్' వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించింది. 'నెట్రికన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్నాడు. రౌడీ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రియుడు విగ్నేశ్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.