యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజమ్ గురించి చాలా మాట్లాడుకున్నారు. బయటవాళ్లకు అవకాశాలు రాకుండా ఇండస్ట్రీలోని కొందరు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో అతడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అతడి సన్నిహితులు చెప్పారు. గత శుక్రవారం(ఆగస్టు 7) అదే కరణ్ ఇంట్లో పార్టీ జరగడం, పలువురు బాలీవుడ్ స్టార్స్ దానికి హాజరు కావడం చర్చనీయాంశమైంది.
డిప్రెషన్లో కరణ్ జోహార్.. నిజమా, నటనా? - karan johar latest news
దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో ఆగస్టు 7న జరిగిన పార్టీకి పలువురు స్టార్స్ హాజరయ్యారు. దీంతో నెటిజన్లు మళ్లీ అతడిని ట్రోల్ చేస్తున్నారు.
దర్శకనిర్మాత కరణ్ జోహార్
సుశాంత్ మృతి తర్వాత కరణ్ 'డిప్రెషన్'లోకి వెళ్లడం నిజమా, కాదా? లేకపోతే ఈ పార్టీ ఏంటి? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన వారిలో అనిల్ కపూర్, నీతూ కపూర్, కియారా అడ్వాణీ తదితరులు ఉన్నారు.
కరణ్ నిర్మించిన 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' సినిమా.. ఆగస్టు 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వీరవనిత గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషించింది.