తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పొగిడిన నోళ్లే తిడుతున్నాయి.. ఎందుకు..? - తెలుగు తాజా సినిమా వార్తలు

రైల్వే స్టేషన్​లో పాటలు పాడుకుంటూ ఉన్న రణు మండల్​ కళను గుర్తించిన ఓ బాలీవుడ్​ సంగీత దర్శకుడు ఆమెకు అవకాశం కల్పించాడు. ఆమె పాడుతున్న పాటలు బాగున్నాయని నెటిజన్లు కూడా మెచ్చుకున్నారు. అలాంటిది వారే ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నారు.

రణు మండల్​పై విమర్శలతో రెచ్చిపోతున్న నెటిజన్లు

By

Published : Nov 19, 2019, 2:00 PM IST

తన పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రణు మండల్​పై ప్రస్తుతం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా ఆమె బాలీవుడ్‌కి గిఫ్ట్ అంటూ మెచ్చుకున్న సోషల్ మీడియా... ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతోంది. ఆమె పాడుతున్న పాటలు విని అద్భుతం అని మెచ్చుకున్న నోళ్లే ఇప్పుడు ఏంటా మేకప్ అని తిట్టిపోస్తున్నాయి.

తాజాగా లెహంగా వేసుకుని, మేకప్​తో ఉన్న ఫొటోను రణు మండల్​ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. అందులో ఆమె మేకప్ ఓవర్​గా ఉండటం వల్ల రణు మండల్​ను గుర్తించడానికి కష్టమైంది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్​ వర్షం కురిపించారు. ఆమెకు అంత మేకప్ ఎందుకు... మేకప్ లేకపోతే ఎవరైనా చిన్నబుచ్చుతున్నారా అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల ఓ అభిమాని రణు మండల్‌ని కలిసి సెల్ఫీ తీసుకుంటానని అడిగితే.. తనకు కాస్త దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోమని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఒకవైపు రణు మండల్​ స్టార్​డమ్‌ను తలకెక్కించుకుంటుందని నెటిజన్లు మండిపడుతుంటే.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతే కాక ఓ ప్రెస్‌మీట్‌లో కాస్త దురుసుగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది.

బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ద్వారా రణు మండల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కొన్ని పాత పాటల్ని ఆమె అత్యంత చక్కగా పాడుతున్న కారణంగా సెలబ్రిటీగా మారింది. ఆమె పాడిన 'తేరీ మేరీ' ఓల్డ్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. మండల్ వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు.

ఇది చదవండి: మలయాళ హిట్ రీమేక్​లో హీరో సుమంత్

ABOUT THE AUTHOR

...view details