ప్రముఖ కథానాయకుడు జూ.ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ్ రామ్.. ఆదివారం రెండో పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తారక్‌తో కలిసి ఉన్న అతడి ఫొటోలను సోషల్‌మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. భార్గవ్‌ను ఎత్తకుని జూ.ఎన్టీఆర్ మురిపెంగా చూస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ.. 'లిటిల్ టైగర్'కు పుట్టినరోజు విషెస్ చెబుతున్నారు. 2011 మే 5న తారక్, ప్రణతిల వివాహం జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు కొడుకులు.
భార్గవ్ రామ్ రెండో పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ - news Junior NTR
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ్ రామ్.. ఆదివారం రెండో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Happy Birthday BhargavaRam
ప్రస్తుతం తారక్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దీనిని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇందులో రామ్‌చరణ్ మరో కథానాయకుడు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇదీ చూడండి: దసరాకే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ షురూ