కాజల్ సోదరిగా(nisha agarwal and kajal agarwal relationship) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పలు సినిమాల్లో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి నిషా అగర్వాల్. 2013లో కరణ్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలోనే నిషా.. ఇన్‌స్టా వేదికగా తరచూ తన అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఫిట్‌నెస్, ఫ్యాషన్‌పై తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నారు. కాగా, తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో సరదాగా ముచ్చటించారు. తన ఫ్యామిలీకి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అందరికీ చూపించారు. కాజల్‌తో దిగిన కొన్ని ఫొటోలను పంచుకుని నిషా ఆనందం వ్యక్తం చేశారు.
ఆ ఒక్కటీ నన్ను అడగొద్దు: నిషా అగర్వాల్ - నిషా అగర్వాల్ ఫొటోషూట్
సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు నటి నిషాఅగర్వాల్(nisha agarwal recent news). ఇందులో భాగంగా.. మంచి స్క్రిప్ట్ వస్తే రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.
నిషా అగర్వాల్
చాట్ సెషన్‌లో భాగంగా ఓ నెటిజన్.. 'మేడమ్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి' అని అడగ్గా.. "నో. అది మాత్రం అడగకండి. నేను ఇవ్వను. మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే దయచేసి నాకు మెయిల్ పంపించండి. అలాగే ఇన్‌స్టాలో డైరెక్ట్ మెస్సేజ్ చేయండి" అని సమాధానమిచ్చారు. మరో నెటిజన్.. "మీరు మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?" అని ప్రశ్నించగా.. "మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను" అని తెలిపారు.
ఇదీ చూడండి: స్విమ్మింగ్‌పూల్‌లో మెరిసిపోతున్న కాజల్