తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎవరీ 'విజేత' - bollywood

తీవ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన దాడుల తర్వాత దేశభక్తిపై తీసిన సినిమాలను నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పుడున్న మూడ్​ ను ప్రతిబింబిస్తున్న ఎనభయో దశకం హిందీ చిత్రం 'విజేత' తెగ ఆదరణ పొందుతోంది.

విజేత చిత్రం

By

Published : Mar 5, 2019, 6:20 PM IST

ఉగ్రవాద స్థావరాలపై ఫిబ్రవరి 26న భారత్‌ చేసిన మెరుపుదాడుల తర్వాత సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ జరుగుతోంది. భారత ఆర్మీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా జరిగిన ఎయిర్​స్ట్రైక్స్​తో మరింత సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనభయో దశకంలో వచ్చిన విజేత సినిమాను తెగ వెతికేస్తున్నారు.

"హిందుస్థాన్ అబ్ చుప్ నహీ బైటేగా.. యే నయా హిందుస్థాన్ హై. యే ఘర్ మే ఘుసేగా భీ.. ఔర్ మారేగా భీ" (ఇండియా ఇప్పుడు మౌనంగా కూర్చోదు.. ఇది కొత్తతరం.. మీ ఇంట్లోకి ప్రవేశిస్తాం.. అవసరమైతే చంపుతాం). 'ఉరీ' సినిమాలోని ఈ డైలాగ్‌ విపరీతంగా వైరల్‌ అయింది. యుద్ధ వాతావరణంలో ఉద్వేగానికి లోనైన భారత యువత దేశభక్తికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.


1983లో విడుదలైన విజేత చిత్రం కోసం అంతర్జాలంలో చాలామంది వెతుకుతున్నారు. తల్లిదండ్రుల గొడవలతో విసిగిపోయిన ఓ యువకుడు యుద్ధ విమాన పైలట్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్లుగానే మిగ్‌-21 అనే యుద్ధ విమానానికి పైలట్‌ అవుతాడు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొంటాడు. ఈ చిత్రం ఎన్నో ఏళ్ల క్రితం వచ్చినా.. ఇప్పటికీ ఉత్తమ చిత్రాల జాబితాలోనే ఉంది. ఈ చిత్రంలో కునాల్‌ కపూర్‌, శశికపూర్‌, రేఖా, సుప్రియా పతక్‌, అమ్రిష్‌ పురి, ఓం పురి ప్రధాన పాత్రలు పోషించారు.

ABOUT THE AUTHOR

...view details