ఓటీటీ వినియోగదారులకు సదావకాశం. శనివారం, ఆదివారం(డిసెంబరు 5,6).. నెట్‌ఫ్లిక్స్‌ను మీరు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. గతంలో ఇదే విషయాన్ని చెప్పిన సదరు ఓటీటీ సంస్థ.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు యాప్‌లోని కంటెంట్ మొత్తాన్ని ఉచితంగా వీక్షించొచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. మరి ఇంకెందుకు ఆలస్యం - భారతీయ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ
నెట్‌ఫ్లిక్స్‌లో ఉచితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలని అనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు కంటెంట్ మొత్తం ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం ఏం చేయాలంటే?
ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. మరి ఇంకెందుకు ఆలస్యం
ఈ అవకాశం వినియోగించుకునేందుకు.. మీ పేరు, ఈమెయిల్/ ఫోన్ నంబర్‌తో నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి లాగిన్ అయితే సరిపోతుంది. ఒక ఫోన్ నంబర్‌తో ఒక అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వొచ్చు.