ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు శుభవార్త వినిపించింది. యూజర్ల సౌకర్యార్థం భాష ఎంపికలో హిందీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. ఫలితంగా భారతీయ, అంతర్జాతీయ చిత్రాలను, వెబ్‌సిరీస్‌లను సులువుగా చూసేందుకు వీలుంటుందని తెలిపింది.
"నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లకు ఇకపై భాష ఎంపికలో హిందీ కూడా అందుబాటులోకి రానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లోని సభ్యులు ప్రతి ఖాతాలో ఐదు ప్రొఫైల్స్‌ను వినియోగించవచ్చు. అలా ప్రతి ప్రొఫైల్‌లో సొంతంగా భాషను ఎన్నుకునే సదుపాయం ఉంటుంది."