తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బంధుప్రీతిపై కంగనకు తాప్సీ కౌంటర్ - కంగనా తాప్సీ మాటల యుద్ధం

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​కు కౌంటర్​ ఇచ్చింది తాప్సీ. కంగన స్టార్​ వారసుల గురించి మాట్లాడిన ఓ త్రో బ్యాక్​ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.

tapsee
తాప్సీ

By

Published : Jul 21, 2020, 9:22 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ కంగనా రనౌత్​, తాప్సీ మధ్య సోషల్​మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా కంగనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్​ వీడియోను పోస్ట్​ చేసి చురకలంటించింది తాప్సీ.

2010లో కంగన.. స్టార్​ నటుల వారసుల పట్ల తన అభిప్రాయం తెలుపుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియోను తాప్సీ పోస్ట్​ చేసింది.

ఇందులో కంగన.. తన ఫ్యామిలీ నేపథ్యం గురించి తెలిపింది. తన తండ్రి బిజినెస్​ మ్యాన్​, తల్లి ఉపాధ్యాయురాలు, తాత ఐఏఎస్​ ఆఫీసర్​, ముత్తాత స్వాతంత్య్ర సమరయోధుడు అంటూ చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ రాసినప్పుడు తనకు ప్రత్యేకమైన కోటా ఉంటుందని చెప్పుకొచ్చింది. అలానే ఇండస్ట్రీలో స్టార్​ కిడ్స్​కు కూడా కోటా ఉంటుందని చెప్పింది.

అయితే దీనిపై స్పందించిన తాప్సీ.. "ఓ అయితే ప్రతి చోట ఇటువంటి సిస్టమ్​ ఉంటుందన్న మాట, ఇంకేం కథ ముగిసింది. అంటూ కౌంటర్​ వేసింది.

ఇది చూడండి : మణిరత్నం 'నవరస' కథలకు హీరోలు వీళ్లేనా!

ABOUT THE AUTHOR

...view details