తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హాఫ్​ గర్ల్​ఫ్రెండ్​'లో సుశాంత్​ హీరోగా ఉండాల్సింది!

బాలీవుడ్​ హీరో సుశాంత్​ మృతి తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి(నెపోటిజం) ఎక్కువగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత చేతన్​ భగత్​ ఐదేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో తన 'హాఫ్​ గర్ల్​ఫ్రెండ్'​ పుస్తకం ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో కథానాయకుడి పేరును ప్రకటించడమే కారణంగా తెలుస్తోంది.

Nepotism row
సుశాంత్

By

Published : Jun 24, 2020, 7:35 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్​ మొత్తం బంధుప్రీతిపై చర్చించుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ రచయిత చేతన్​ భగత్​ ఐదేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ తాజాగా​ వైరల్​గా మారింది. ఇందులో సుశాంత్​ను 'హాఫ్​ గర్ల్​ఫ్రెండ్'​ పుస్తక ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో కథానాయకుడిగా ప్రకటించారు భగత్​.

ట్వీట్​

ప్రస్తుతం ఈ ట్వీట్​ను నెటిజన్లు షేర్​ చేస్తూ.. పక్షపాతాన్ని ప్రదర్శించి చివరికి సుశాంత్​ స్థానంలో అర్జున్​ కపూర్​ను ఎంపిక చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నెపోటిజం వల్ల బాలీవుడ్​ అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. మరి కొంతమంది కరణ్ జోహార్​, మహేశ్​ భట్​, యష్​రాజ్​లు నిర్మించిన చిత్రాలను ఇకపై చూడమని ప్రతిజ్ఞ పూనారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులపై ట్రోల్స్​ వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

ABOUT THE AUTHOR

...view details