బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్నాడు. అక్కడున్న ఓ అభిమానితో తాజాగా సెల్ఫీవీడియోలో కనిపించాడీ స్టార్ హీరో. " నేపాల్ గ్రామంలో ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పండి" అని ఆ ఫ్యాన్ కోరగా.. నేపాల్ గ్రామం కాదు, దేశం అని చెప్పాడు వరుణ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పాండే(అభిమాని పేరు) సన్నిహతులకు, స్నేహితులకు ఆ వీడియో ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపాడు వరుణ్ ధావన్. అంతేకాకుండా నేపాల్ ప్రజలందరికీ విషెస్ చెప్పాడీ స్టార్ హీరో.