పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'వకీల్‌సాబ్'. పవన్‌ని స్క్రీన్‌పై ఏవిధంగా చూడాలని ఓ అభిమాని కోరుకుంటాడో అంతే పవర్‌ఫుల్‌గా చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్. సినిమాలోని విజువల్స్‌తోపాటు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో అందరూ ఈలలు వేశారు.
'వకీల్‌సాబ్' రీక్రియేట్.. కుర్రాళ్లు ఇరగదీశారు! - వకీల్‌సాబ్‌ను రీక్రియేట్ చేసిన నెల్లూరు కుర్రాళ్లు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్‌సాబ్' ఏప్రిల్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అభిమానుల చేత ఈలలు కొట్టించింది. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీక్రియేట్ చేశారు నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కాగా, తాజాగా 'వకీల్‌సాబ్' సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సన్నివేశాలను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఈ వీడియోని పవర్‌స్టార్ అభిమానులు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. సంగీత దర్శకుడు తమన్‌తో పాటు పలువురు నెటిజన్లు.. 'కుర్రాళ్లు ఇరగదీశారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్'తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేధా థామస్, అంజలి, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు. ప్రకాశ్‌రాజ్ నంద పాత్రలో మెప్పించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.