తెలంగాణ

telangana

ETV Bharat / sitara

8 నెలల గర్భంతో షూటింగ్​లో పాల్గొన్న హీరోయిన్​! - నేహా ధూపియా మూవీస్

ప్రస్తుతం గర్భంతో ఉన్నప్పుటికీ, చురుగ్గా చిత్రీకరణలో పాల్గొంది ఓ హీరోయిన్. అదీ పోలీస్ అధికారిణి పాత్ర కావడం మరో విశేషం. ఇంతకీ ఎవరా కథానాయిక?

neha dhupia upcoming movies
8 నెలల గర్భంతో షూటింగ్​లో పాల్గొన్న హీరోయిన్​!

By

Published : Aug 25, 2021, 8:49 AM IST

బాలీవుడ్​ కథానాయిక నేహా ధూపియా (neha dhupia) ప్రస్తుతం 8 నెలల గర్భిణి. అయినా నటనకు విరామం ఇవ్వకుండా ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొంటోంది. మరో విశేషమేంటంటే తెరపై గర్భిణీ పోలీస్​ అధికారిణిగా నటిస్తోంది. ఆ చిత్రమే 'ఏ థర్స్​డే'. జేహ్​జాద్​ ఖంబాటా తెరకెక్కిస్తున్నారు. యామీగౌతం, డింపుల్​ కపాడియా, అతుల్​ కులకర్ణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

గురువారం రోజు జరిగే అనూహ్య సంఘటన నేపథ్యంలో థ్రిల్లర్​ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. దీనిపై నేహా ధూపియా ఆనందం వ్యక్తం చేసింది. నిజ జీవితానికి, తెర జీవితానికి మధ్య అంతరాన్ని చెరిపేసే పాత్రను పోషిస్తుండటం మరపురాని అనుభూతి అని నేహా పేర్కొంది. ఈ చిత్రంలోని తన లుక్​ను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ఇదీ చదవండి :'సినిమాల్లోకి రాకముందు బొగ్గు గనుల్లో పనిచేశా'

ABOUT THE AUTHOR

...view details