బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, నీతూ కపూర్, దర్శకుడు రాజ్ మెహతాలు డిసెంబరు ప్రారంభంలో కరోనా బారిన పడ్డారు. చండీగఢ్‌లో 'జుగ్ జుగ్ జీయో' చిత్రీకరణ సమయంలో వీరికి వైరస్ సోకినట్లు తేలింది. నీతూ కపూర్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. అయితే హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం కొవిడ్‌తో పోరాడుతున్నారని సమాచారం.
షూటింగ్‌కు సిద్ధమైన వరుణ్, నీతూ కపూర్! - వరుణ్ ధావన్ వార్తలు
బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, నీతూ కపూర్లు కరోనా నుంచి కోలుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో 'జుగ్ జుగ్ జీయో' చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
షూటింగ్‌కు సిద్ధమైన వరుణ్, నీతూ కపూర్!
గురువారం వరుణ్‌ను మరోసారి పరీక్షించనున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందులో వైరస్ లేనట్లు నిర్ధారణ అయితే 14 రోజుల నిర్బంధం పూర్తైన తర్వాత అతడు షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తోంది. దర్శకుడు అందుబాటులో లేకపోయినా హీరోయిన్ కియారా అడ్వాణీ, అనిల్ కపూర్లపై సన్నివేశాలు తెరకెక్కించడానికి నిర్మాత సిద్ధమయ్యారని సమాచారం.