నీట్ పరీక్ష భయంతో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తన మనసు కదిలించిందని తమిళ అగ్రహీరో సూర్య ట్వీట్ చేశారు. ఈ సంఘటన తనను చాలా బాధించిందని అన్నారు.
"విద్యార్థులు వారి విలువను నిరూపించుకోవడానికి ఈ పరీక్ష రాయాల్సి వస్తోంది. 'నీట్' వారి అవకాశాలను దూరం చేయడమే కాకుండా ప్రాణాలునూ తీస్తోంది. ఒక్క పరీక్షతో విద్యార్థి అర్హత, నైపుణ్యాలను లెక్కించడం సరైన పద్ధతి కాదు. నిన్న ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై మనం అప్రమత్తంగా లేకపోతే ఇదే పరిస్థితి మళ్లీ మళ్లీ జరుగుతుంది. డాక్టర్ కావాలన్న విద్యార్థుల కల చెదిరిపోయి సాధారణ కుటుంబాలకు చెందిన అమాయక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మనమంతా మౌనం వీడాలి. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మన గళాన్ని వినిపించాలి"