నీరజ్ చోప్డా.. ప్రస్తుతం దేశం మొత్తం మార్మోగిపోతున్న పేరు. 23 ఏళ్ల ఈ కుర్రాడు టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడి భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కలను నెరవేర్చి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరీ ప్రశంసలను అందుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చోప్డా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఒకవేళ తన బయోపిక్‌ను తెరకెక్కిస్తే.. అందులో స్టార్ హీరో అక్షయ్‌కుమార్ లేదా రణ్‌దీప్ హుడా నటించాలని ఆకాంక్షించాడు.
అంతకుముందే అక్షయ్.. నీరజ్ స్వర్ణం సాధించడంపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో అభిమానులు.. అక్షయ్ యుక్త వయసులో ఉన్నప్పుడు ఓ సినిమా సెట్లో కర్ర పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.