నవంబరు 13న జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న ఇవ్వనున్నారు. వీరిలో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్డా(అథ్లెటిక్స్), రవి కుమార్(రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్(బాక్సింగ్), శ్రీజేష్(హాకీ) ఉన్నారు. హకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును తాజాగా ఈ జాబితాలో చేర్చారు.
వీరితో పాటు పారాలింపిక్ ప్లేయర్ల్ అవనీ లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి.. ఈ ఏడాది ఖేల్‌రత్న అవార్డు అందుకోనున్నారు.