మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా 'ఆచార్య'(acharya movie). రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా గురువారం ఈ సాంగ్ ప్రోమో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'నీలాంబరి'(neelambari song acharya) అంటూ సాగే ఈ సాంగ్‌ను రామ్‌చరణ్, పూజాహెగ్డేలపై తెరకెక్కించారు. మణిశర్మ బాణీలందించిన ఈ మెలోడీ సాంగ్‌లో చరణ్, పూజ కెమిస్ట్రీ అదిరిపోయింది.
'ఆచార్య' నుంచి 'నీలాంబరి' సాంగ్.. చరణ్, పూజ కెమిస్ట్రీ అదుర్స్ - నీలాంబరి సాంగ్ ఆచార్య
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య(acharya movie). తాజాగా ఈ సినిమాలోని రెండో పాట(neelambari song acharya)ను విడుదల చేసింది చిత్రబృందం. నీలాంబరి అంటూ సాగే ఈ పాటలో చరణ్, పూజా హెగ్డే కెమిస్ట్రీ అదిరిపోయింది.
ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal movies), రామ్‌చరణ్‌కు(ram charan new movie) జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.