జాన్ అబ్రహం.. రొమాంటిక్ చిత్రం 'జిస్మ్'తో వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించాడు. తర్వాత కామెడీ సినిమాలు చేశాడు. అనంతరం యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఎప్పటినుంచో ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందంటూ మనసులోని మాట బయటపెట్టాడిప్పుడు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
''లవ్‌స్టోరీ అనేది అద్భుతమైన జానర్. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రాన్ని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. కానీ సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు.'' -జాన్ అబ్రహం, బాలీవుడ్ హీరో