తెలంగాణ

telangana

చిక్కుల్లో 'బొంబే బేగమ్స్' వెబ్ సిరీస్

By

Published : Mar 12, 2021, 8:52 PM IST

మహిళ దినోత్సవం సందర్భంగా ఓటీటీలో రిలీజైన 'బొంబే బేగమ్స్' సిరీస్​కు ఇబ్బందులు తప్పట్లేదు. బాలలను కించపరిచే సన్నివేశాలను ఉన్నాయంటూ ఎన్​సీపీసీఆర్ నెట్​ఫ్లిక్స్​కు నోటీసులు జారీ చేసింది.

NCPCR demands Netflix show Bombay Begums be banned
చిక్కుల్లో 'బొంబే బేగమ్స్' వెబ్ సిరీస్

నెట్​ఫ్లిక్స్​లో ఇటీవల విడుదలైన 'బొంబే బేగమ్స్' వివాదంలో చిక్కుకుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు బాలల హక్కులను హరించే విధంగా ఉన్నాయని కొందరు ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల కమీషన్ ఛైర్మన్ ప్రియాంక మాట్లాడుతూ.. ఈ సిరీస్​ను ఓటీటీ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ విషయమై సదరు సంస్థ స్పందించాల్సి ఉంది.

ముంబయిలోని వివిధ రంగాలకు చెందిన ఐదుగురు మహిళల జీవితానికి సంబంధించిన కథతో ఈ సిరీస్​ను తెరకెక్కించారు. చాలాకాలం తర్వాత పూజా భట్ ఇందులో నటించారు.

ఇటీవల కాలంలో వెబ్​ సిరీస్​లు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాయి. 'తాండవ్', 'మీర్జాపుర్' కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాయి.​

'బొంబే బేగమ్స్' వెబ్ సిరీస్

ABOUT THE AUTHOR

...view details