డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరైన హీరోయిన్ దీపికా పదుకొణెను ఐదు గంటలపాటు అధికారులు విచారించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.
డ్రగ్స్ కేసు: ఐదు గంటలపాటు సాగిన దీపిక విచారణ - సుశాంత్ కేసు అప్డేట్స్
Bollywood actor Deepika Padukone deposed before Narcotics Control Bureau (NCB) in a drug case related to the death of actor Sushant Singh Rajput.
16:13 September 26
13:08 September 26
ఎన్సీబీ కార్యాలయానికి సారా ఆలీఖాన్
ఎన్సీబీ కార్యాలయానికి బాలీవుడ్ నటి సారా ఆలీఖాన్ కూడా చేరుకుంది. ఇప్పటికే దీపిక పదుకొణె, శ్రద్ధా కపూర్ విచారణ నిమిత్తం అధికారుల ముందు హాజరయ్యారు.
12:20 September 26
ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న శ్రద్ధా
నటి శ్రద్ధా కపూర్ ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుంది. సుశాంత్ మృతికి సంబంధించిన డ్రగ్ కేసు విచారణ నిమిత్తం ఎన్సీబీ ఆమెను ప్రశ్నించనుంది.
10:18 September 26
ఎన్సీబీ ఎదుట నటి దీపిక హాజరు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం విచారణ నిమిత్తం నటి దీపికా పదుకొణె ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది.
ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండేలతో కలిసి ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న దీపిక.. అధికారుల ఆదేశాల మేరకు గోవా నుంచి ముంబయికి చేరుకుంది. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత మధు మంతెనా, ధర్మ ప్రొడక్షన్స్ రవిప్రసాద్ వంటి వారిని అధికారులు ప్రశ్నించారు. దీపికతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ కూడా ఎన్సీబీ ఎదుట హాజరుకానున్నారు.
ఇటీవలే అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించగా.. పలువురు పేర్లు వెల్లడించినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే వారందరికీ సమన్లు జారీ చేసినట్లు వివరించారు.