దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతికి సంబంధించి డ్రగ్స్ కేసులో ఎన్సీబీ(మాదకద్రవ్య నియంత్రణ సంస్థ) శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. 33 మంది పేర్లతో ప్రత్యేక కోర్టుకు దానిని సమర్పించింది. 200 మంది సాక్షుల వాంగ్మూలాలను ఇందులో జోడించింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితోపాటు మాదకద్రవ్యాలు సరఫరా చేసే పలువురి పేర్లు ఈ ఛార్జిషీట్‌లో నమోదు చేసినట్లు సమాచారం.
సుశాంత్ కేసు ఛార్జిషీట్‌లో 33 మంది పేర్లు! - bollywood latest news
సుశాంత్ మృతికి సంబంధించిన కేసులో 33 మంది పేర్లతో కూడిన ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టుకు ఎన్సీబీ సమర్పించింది. గతేడాది జూన్ 14న తన ఇంట్లో ఉరి వేసుకుని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు.

సుశాంత్ కేసు ఛార్జిషీట్‌లో 33 మంది పేర్లు!
గతేడాది జూన్‌లో తన నివాసంలో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రగ్స్ కోణంలోనూ విచారణ చేపట్టారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడితోపాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ అగ్ర నటీనటులు, దర్శక నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి.