సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. సోమవారం రియా చక్రవర్తిని 8 గంటల పాటు విచారించిన అధికారులు.. మంగళవారం మరోసారి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో పాటు సుశాంత్ సహాయకుడు దీపేశ్ సావంత్‌కు మాదక ద్రవ్య వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
మూడోసారి రియాకు ఎన్సీబీ సమన్లు - సుశాంత్
సుశాంత్ రాజ్‌పుత్ కేసు విచారణలో భాగంగా మూడో సారి రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసింది ఎన్సీబీ. మంగళవారం మరోసారి దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించింది.
రియా చక్రవర్తి
ఆదివారం మొదటిసారి ఎన్సీబీ ముందు రియా హాజరు కాగా.. సుమారు ఆరు గంటల పాటు అధికారులు ఆమెను విచారించారు. సుశాంత్ కేసులో మాదక ద్రవ్యాల వాడకంపై వివిధ కోణాల్లో రియాపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే డ్రగ్స్ సేకరణలో నిందితులుగా పేర్కొంటూ.. రియా సోదరుడు షౌవిక్, శామ్యూల్ మిరండాలను ఎన్సీబీ అరెస్టు చేసింది. వీరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.