బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులోని డ్రగ్స్ కోణంపై ఎన్సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టైనా నటి రియా చక్రవర్తి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టారు అధికారులు. ఈ క్రమంలో ఆమె కొందరు సినీ ప్రముఖుల పేర్లు ఎన్సీబీకి వెల్లడించింది.
డ్రగ్స్ కేసు: రకుల్, సారా అలీఖాన్‌కు త్వరలోనే సమన్లు! - రకుల్‌ప్రీత్ సింగ్
సుశాంత్ మృతి కేసులోని డ్రగ్స్ కోణంలో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే నటి రియా చక్రవర్తి సహా 16 మందిని అరెస్టు చేశారు. నటి రియా వెల్లడించిన హీరోయిన్లు రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌తో పాటు డిజైనర్ సిమోనె ఖంబట్టాలను విచారణకు పిలిపించేందుకు త్వరలోనే సమన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎన్సీబీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
సినీతారలు సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోనె ఖంబట్టాల పేర్లు బయటకు వచ్చినట్లు.. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా సోమవారం అధికారికంగా తెలిపారు. త్వరలోనే వీరందరికీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారులు స్వయంగా తెలియజేశారు.
మరోవైపు, అధికారులు శనివారం ముంబయి, గోవాలలో పలు చోట్ల సోదాలు నిర్వహించి.. మరో ఆరుగురిని అరెస్టు చేశారు. బాంద్రాకు చెందిన కరంజీత్ సింగ్ ఆనంద్ అలియాస్ కేజేని అదుపులోకి తీసుకొని.. దక్షిణ ముంబయిలోకి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అతడు డ్రగ్స్ సిండికేట్‌లో భాగస్వామిగా ఉన్నట్టు గుర్తించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటి వరకు రియా సహా 16మందిని అరెస్టు అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌కు.. న్యాయస్థానం ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.