ఎన్సీబీ అదుపులో రియా సోదరుడు, సహాయకుడు - sushanth drug rocket
బాలీవుడ్లో మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారులు.. రియా సోదరుడు సోవిక్తో పాటు ఆమె సహాయకుడు శామ్యూల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ అదుపులో రియా సోదరుడు, సహాయకుడు
యువహీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో బాలీవుడ్‌కు మాదక ద్రవ్యాలకు ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారులు శుక్రవారం, నటి రియా చక్రవర్తితోపాటు ఆమె సహాయకుడు శామ్యూల్ మిరండా ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం శామ్యూల్‌తో పాటు రియా సోదరుడు సోవిక్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.