తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ వ్యక్తిగత సిబ్బందికి ఎన్​సీబీ సమన్లు - సిద్ధార్థ్​ పితాని అరెస్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​(sushant singh rajput) ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్​సీబీ ముమ్మరం చేసింది. అతడి వ్యక్తిగత సిబ్బంది అయిన నీరజ్​, కేశవ్​కు సమన్లు జారీ చేసింది.

NCB calls Sushant's servants for inquiry
NCB calls Sushant's servants for inquiry

By

Published : May 30, 2021, 6:25 PM IST

హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కేసులో సిద్ధార్థ్​ పితాని అరెస్టు తర్వాత.. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) ఇప్పుడు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. సుశాంత్​ సహాయకులైన నీరజ్​, కేశవ్​ విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

"సిద్ధార్థ్​ పితాని అరెస్టు తర్వాత.. సుశాంత్​ ఇంట్లో సహాయకులుగా పనిచేసిన నీరజ్​, కేశవ్​ను విచారించాలని నిర్ణయించాం. డ్రగ్స్​ కేసులో భాగంగా వారిద్దరిని ప్రశ్నించనున్నాం".

- నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, ముంబయి

అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్​ ఫ్లాట్​మేట్​ సిద్ధార్థ్​ పితానిని(ncb arrests pithani) గత శుక్రవారం(మే 28)న ఎన్​సీబీ అధికారులు అరెస్టు చేశారు. సుశాంత్​ ఆత్మహత్య కేసులో భాగంగా డ్రగ్స్​ కోణంలో విచారించేందుకు సిద్ధార్థ్​ను 5 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అయితే గతంలో సిద్ధార్థ్​ను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఎన్​సీబీ అధికారులు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసులో అకస్మాత్తుగా సిద్దార్థ్​ను అరెస్ట్ చేయడం పట్ల మరోసారి బాలీవుడ్​లో కలకలం రేగుతోంది.

ఇదీ చూడండి:sushanth death case: సిద్దార్థ్ పితాని అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details