తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలకృష్ణ సినిమాలో మరో స్టార్.. సంక్రాంతి రేసులో మరో చిత్రం - kalyan dev super machi songs

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో బాలకృష్ణ కొత్త సినిమా, ఉనికి, గెహరయాన్, సూపర్​మచ్చి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

balayya
బాలయ్య

By

Published : Jan 5, 2022, 11:42 AM IST

NBK107: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. తమిళ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్​కుమార్.. ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. కన్నడ నటుడు దునియా విజయ్​ను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నట్లు ఇటీవల వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్​కుమార్

మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కే ఈ సినిమాకు 'క్రాక్​'తో హిట్​ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారు. తమన్ సంగీతమందిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ఏడాది దసరాకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sankranti 2022 cinemas: సంక్రాంతి రేసులో మరో సినిమా చేరింది. 'ఉనికి' టైటిల్​తో తెరకెక్కిన చిత్రాన్ని జనవరి 15న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో అశిష్ గాంధీ, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్​కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఉనికి మూవీ

Gehraiyaan movie: దీపికా పదుకొణె కొత్త సినిమా 'గెహరయాన్' కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించారు. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్​ వీడియోలో నేరుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనితోపాటే కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు.

గెహరయాన్ ఓటీటీ రిలీజ్ డేట్

రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికతో పాటు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కార్వ ఇతర కీలకపాత్రలు పోషించారు. శకున్ బత్రా దర్శకత్వం వహించారు. కరణ్​ జోహార్, వయకామ్ 18 స్టూడియోస్​తో కలిసి నిర్మించారు.

*మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కల్యాణ్​దేవ్ హీరోగా నటించిన సినిమా 'సూపర్​మచ్చి'. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుందీ చిత్రం. 'డించకు డించకు' అంటూ సాగే డ్యాన్స్​ నంబర్ లిరికల్​ వీడియోను బుధవారం రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో కల్యాణ్​దేవ్ సరసన రచితరామ్ హీరోయిన్​గా చేసింది. పులి వాసు దర్శకత్వం వహించారు. తమన్ సంగీతమందించారు. రిజ్వాన్ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై రిజ్వాన్.. ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details