తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ నలుదిశలకు వ్యాపింపజేసిన బ్లాక్ బస్టర్ 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడా చిత్రానికి ప్రీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ప్రీక్వెల్‌ని వెబ్‌సిరీస్ రూపంలో విడుదల చేయనున్నట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
'బాహుబలి'కి ప్రీక్వెల్.. కీలకపాత్రలో నయనతార! - బాహుబలికి ప్రీక్వెల్‌లో నయనతార
టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాసి, ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిన చిత్రం 'బాహుబలి'. సినిమాకు ప్రీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ప్రీక్వెల్‌ని వెబ్‌సిరీస్ రూపంలో విడుదల చేయబోతుంది. తాజాగా ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలకపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.
కాగా, తాజా సమాచారం ప్రకారం మాహిష్మతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది? అసలు శివగామి ఎవరు? వంటి కీలక అంశాల ఆధారంగా తొమ్మిది ఎపిసోడ్లతో ఈ సిరీస్ రూపొందించనున్నారట. బాలీవుడ్ నటి వామికా గబ్బి శివగామి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ ప్రీక్వెల్‌లో కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలకపాత్రలో కనిపించనున్నారని అందరూ చెప్పుకొంటున్నారు. అయితే, ఆమె ఏ పాత్రలో కనిపించనున్నారు? ఆమె పాత్ర ఇతివృత్తం ఏమిటి? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
2017లో ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత రాసిన 'ది రైజ్ ఆఫ్ శివగామి' అనే నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించనున్నారట. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్ దేవినేని, రాజమౌళి ఈ సిరీస్ నిర్మించనున్నారని.. దేవకట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.