దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తమిళంలో 'ముక్తి అమ్మన్' సినిమాలో కన్యాకుమారి దేవత పాత్రలో నటిస్తోంది. ఇందుకోసం శాకాహారిగా మారాలని అనుకుంది. దీనితో పాటే రోజుకు ఓ పూట ఉపవాసం ఉండాలని అనుకుంటోందట.
నయనతార ఇలా మారడం ఇదేం కొత్త కాదు. తెలుగులో ఇంతకు ముందు 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్ర పోషించింది. ఆ చిత్ర షూటింగ్ పూర్తయ్యే వరకు శాకాహారిగానే ఉంది. ఇప్పుడు అలానే మారాలని నిర్ణయం తీసుకుందట.