విజయ్-నయనతార జంటగా నటించిన చిత్రం 'విజిల్'. ఇటీవలే విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రంలో మహిళా ఫుట్‌బాల్ జట్టుకు సారథిగా వ్యవహరించింది అమృతా అయ్యర్. అయితే ఈ నటి పుట్టినరోజు సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నయనతార.. అమృతకు సర్ఫ్రైజ్ ఇచ్చింది.
'విజిల్' స్టార్‌కు నయనతార సర్ఫ్రైజ్ - Nayanthara surprises Bigil actress
'విజిల్' చిత్రంలో మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది నటి అమృతా అయ్యర్. అయితే అమృత పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ నయనతార సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది అమృత.
నయన్
అనుకోకుండా చిత్రబృందంతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నానని, కాకపోతే ఆ సమయంలో నయనతార అక్కడ లేరని అమృతా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ తరుణంలో నయనతార నటి అమృతా అయ్యర్‌కు ఓ వాచ్‌ను గిఫ్ట్‌గా పంపించింది. దీనికి సంబంధించిన ఫొటోలను అమృతా సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నయనతార నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను పొందడం ఎంతో సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది.
ఇవీ చూడండి.. స్టార్‌ను అనే విషయాన్ని పట్టించుకోను: అక్షయ్