తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ పుట్టినరోజును ప్రతి ఏడాది విదేశాల్లో నిర్వహిస్తుంటుంది నటి నయనతార. అయితే కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది నయన్.. విఘ్నేశ్ పుట్టినరోజును గోవాలో వేడుకగా జరిపించింది. వీరిద్దరూ కొన్నిరోజులపాటు గోవాలో సరదాగా గడిపారు. టూర్‌కి సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టూర్ పూర్తి చేసుకుని ఇటీవలే వీరిద్దరూ ఓ ప్రైవేట్ చార్టర్‌లో చెన్నైకి తిరిగివచ్చారు. అయితే ఈ టూర్ కోసం నయన్ భారీగా ఖర్చు చేసిందట.
ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ భారీ ఖర్చు! - నయనతార విఘ్నేశ్ శివన్ గోవా టూర్
ఇటీవల తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు కోసం గోవా వెళ్లింది నటి నయనతార. అక్కడ కొన్నిరోజులు సరదాగా గడిపిన వీరిద్దరూ ఓ ప్రైవేట్ చార్టర్‌లో చెన్నైకి తిరిగొచ్చారు. అయితే ఈ ట్రిప్ కోసం భారీగా ఖర్చు చేసిందట నయన్.
ఈ బర్త్‌డే టూర్ కోసం నయన్ అక్షరాలా రూ.25 లక్షలు ఖర్చు చేసిందని.. పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రియుడి పుట్టినరోజు కోసం నయన్ ఇంత ఖర్చుపెట్టిందా అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. 'గోవా టూర్ బాగా ఖరీదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
2015లో తెరకెక్కిన 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ సమయంలో నయన్‌కి విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'దర్బార్' చిత్రం తర్వాత నయన్ 'నెట్రికారన్', 'కాతువక్కుల రెండు కాదల్', 'ముక్తి అమ్మన్' చిత్రాల్లో నటిస్తోంది. నయన్ ప్రధానపాత్రలో తెరకెక్కనున్న 'నెట్రికారన్' చిత్రానికి విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అలాగే 'కాతువక్కుల రెండు కాదల్' చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో నయన్, సమంత, విజయ్ సేతుపతి కీలకపాత్రలు పోషించనున్నారు.