తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అన్నాత్తే' కోసం భాగ్యనగరం చేరిన నయన్ - అన్నాత్తే షూటింగ్​ కోసం భాగ్యనగరం చేరిన నయన్

సూపర్​స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అన్నాత్తే'. తాజాగా ఈ సినిమా షూటింగ్​లో పాల్గొనేందుకు హైదరాబాద్​కు విచ్చేసింది నయనతార.

Rajni, nayan
రజనీ, నయన్

By

Published : Apr 27, 2021, 8:24 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అన్నాత్తే'. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొద్దిరోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకొంటోంది. అయితే హైదరాబాద్​లోని ఐకియా స్టోర్ వద్ద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారట. తాజాగా ఈ మూవీ షూటింగ్​లో పాల్గొనేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార భాగ్యనగరంలో అడుగుపెట్టింది. ఇక్కడి షెడ్యూల్ మే 10వరకు జరగనుందని సమాచారం.

ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర కోసం ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్‌లో షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టినా.. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేశ్​, మీనా, ఖుష్బూ, ప్రకాశ్​ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details