బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్-తమిళ దర్శకుడు అట్లీ(sharukh atlee film) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాల్సిన నయనతార తప్పుకొన్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగింది(nayantara sharukh film). అయితే ఇప్పుడు ఆమె మళ్లీ వెనక్కి వచ్చిందని సమాచారం. ఈ మూవీలో నయన్.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలిసింది.
ఇక ఈ చిత్రంలో షారుక్-నయన్ మధ్య లవ్‌ట్రాక్ కూడా ఉంటుందట! ఈ మూవీలో బాద్షా.. డబుల్ రోల్ పోషిస్తారని టాక్. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుందని తెలిసింది. ఈ చిత్ర కథాంశం.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'మనీ హైస్ట్' వెబ్‌సిరీస్‌కు దగ్గరగా ఉంటుందని అంటున్నారు.