తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లవ్​బర్డ్స్'​ నయనతార​-విఘ్నేశ్​కు కరోనా? - Nayanthara and beau Vignesh Shivan got corona

దక్షిణాది ప్రేమజంట​ నయనతార-విఘ్నేశ్​ల​కు కరోనా సోకిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వారి సన్నిహితులు అవన్నీ పుకార్లేనని తేల్చారు.

nayan
నయన్​తార-విఘ్నేశ్​

By

Published : Jun 21, 2020, 4:58 PM IST

ప్రస్తుతం డేటింగ్​లో ఉన్న హీరోయిన్​ నయనతార- దర్శకుడు విఘ్నేశ్​ శివన్​లకు​ కరోనా సోకిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు షాకయ్యారు. ఆ తర్వాత అసలు నిజం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

అవన్నీ పుకార్లే

అయితే కరోనా వచ్చిన విషయం వదంతేనని వారి సన్నిహితులు కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని సూచించారు. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ బాగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.

2015లో వచ్చిన 'నేనూ రౌడీనే' సినిమా కోసం దర్శకుడు విఘ్నేశ్‌తో కలిసి నయన్ పనిచేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. ఆ తర్వాత నుంచి ఈ జంట, కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నయన్‌.. 'నెట్రికారన్‌', 'కాతువక్కుల రెండు కాదల్‌', 'ముక్తి అమ్మన్‌' చిత్రాల్లో నటిస్తోంది.

నయన్​తార-విఘ్నేశ్​

ఇది చూడండి : త్వరలోనే గుడిలో నయనతార పెళ్లి​!

ABOUT THE AUTHOR

...view details